తానొస్తే ఆ బిల్లుల‌న్నీ చెల్లిస్తాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. జ‌రుగుతుందా..

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం దాదాపుగా చాలా మంది వ‌దిలేసుకున్నారు. ఎందుకంటే వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేస్తోందో అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రిస్థ‌తుల్లో మళ్లీ ఇంకో పార్టీని గెలిపించుకోవాల‌న్న ఆలోచ‌న ప్ర‌జ‌ల‌కు అయితే రాదేమో అనిపిస్తుంది. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు కూడా మ‌రోసారి తాము అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్రం మ‌ళ్లీ తాను అధికారంలోకి వ‌స్తాన‌ని ధీమాగా చెబుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న  ఆ పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయ‌న మ‌ళ్లీ తమ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో చెబుతున్నారంట‌. ప్ర‌దానంగా ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ ఎంపీలు గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు.

గ్రామాల్లో చేసిన ప‌నుల బిల్లులు చెల్లించ‌కుండా ప్ర‌భుత్వం నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఫిర్యాదు చేశారు. ఒక ప్ర‌భుత్వ‌హ‌యాంలో చేసిన ప‌నుల బిల్లులు మ‌రో ప్ర‌భుత్వం ఇవ్వ‌క‌పోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అన‌వ‌స‌రంగా ఈ బిల్లుల‌ను నిలిపివేశార‌ని చెప్పారు. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు స్పందిస్తూ తాను మళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బిల్లుల‌ను చెల్లిస్తాన‌ని చెప్పారంట‌. 24 శాతం వడ్డీతో స‌హా ఇచ్చేందుకు కోర్టుల్లో పోరాటం చేస్తామ‌న్నారు. అయితే ఆ బిల్లు రాక‌పోతే తాను అధికారంలోకి వచ్చిన త‌ర్వాత క‌చ్చితంగా ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో నీరు చెట్టు కింద పూడిక తీత ప‌నుల్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే బిల్లులు ఎందుకు ఆగిపోయాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి తానొస్తే అన్ని ఇస్తాన‌ని చెప్ప‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారా అంటూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మాట్లాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here