బిగ్ బాస్ నాగవల్లికి..  దాసరికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? 

న్యూస్ యాంకర్ గా చలాకీగా మాట్లాడుతూ.. తన పదునైన మాటలతో ఎదుటివారిని ఇరుకున పెట్టే దేవి నాగవల్లి ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీసారి మగ వారే బిగ్ బాస్ హౌజ్ విజేతగా నిలుస్తారా..? ఈసారి టైటిల్ నేను గెలుస్తానని చెప్పి మరీ బరిలో నిలిచింది దేవి నాగవల్లి.

ఇక కెమెరా ముందు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే దేవి జీవితంలో ప్రపంచానికి తెలియని ఎన్నో కష్టాలు ఉన్నట్టు బిగ్ బాస్ ఇంటిలోకి అడుగు పెట్టే సమయంలో టెలికాస్ట్ చేసిన వీడియోలో దేవి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో తనదైన శైలిలో దూసుకెళుతోంది దేవి.

ఇదిలా ఉంటే ఇటీవల దేవి అమ్మ గారు ఓ మీడియా సంస్థతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…’దేవి జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకుంది. జీవితంలో  ఎంతో పోరాడి గెలిచిన దేవి… బిగ్ బాస్ హౌజ్ లోనూ పోరాడి గెలుస్తుంది. దేవి తండ్రి 2000వ సంవత్సరంలో చనిపోయిన సమయంలో కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుంది. ఆమె అన్నయ్య,  తమ్మడు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారంటే ఆమె వల్లే. రాజ‌మండ్రిలో ఉంటున్న మేమంతా క‌లిసే ఉంటాం. దాస‌రి నారాయ‌ణ‌రావు కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది. దేవి నాన్న గారికి దాసరి నారాయణ రావు మేనమామ అవుతారు. అంటే  దేవికి దాస‌రి తాత వరుస అన్నమాట‌. ఆయన పేరును ఎప్పుడు ఎక్కడ కూడా మేము వాడుకోలేదు. ఆయన నుంచి ఎప్పుడు కూడా సాయం పొందలేదు. పాలకొల్లు వచ్చినప్పుడు తరుచు కలుస్తూ ఉండేవాళ్లం. వారింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వెళ్తూ ఉండేవాళ్లం’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here