” పవన్ కళ్యాణ్ కి ఇరవై నాలుగు గంటలూ భజన అలవాటైంది.. “

హీరో పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ఇంపార్టెంట్ సినిమా గా తమ్ముడు చిత్రం గురించే చెప్పుకోవాలి. ఆయన కి సరైన టైం లో పడిన సూపర్ చిత్రం అది. జులాయిగా తిరిగే హీరో బాధ్యత తెలుసుకుని కుటుంబం పేరు , అన్నయ్య ప్రతిష్ట నిలబెట్టిన స్టోరీ తో సాగే ఈ కథ తో యవాత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగా కనక్ట్ అయ్యింది. ఆ సినిమా విడుదల అయ్యి ఇరవై ఏళ్ళు గడుస్తున్న నేపధ్యం లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .. ” పవన్ కళ్యాణ్ ఒకప్పటి లాగా లేడు .. ఆయనలో చాలా మార్పు వచ్చేసింది.

ఒకప్పుడు మాతో పాటు కింద కూర్చుని తినే వ్యక్తి అతను. అసిస్టెంట్ డైరెక్టర్ లు కూడా పేరు పెట్టి కళ్యాణ్ అనీ .. నువ్వు నువ్వు అంటూ సంబోధించేవారు పవన్ ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చుట్టూ భజన బృందం పవన్ కి ఎక్కువగా కనిపిస్తోంది. సింపుల్ సిటీ లో ఇంకా అలాగే ఉన్న పవన్ పక్కనే ఉంది బ్యాండ్ కొట్టేవారి మాటలు ఎక్కువగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది ” అని చెప్పుకొచ్చారు అరుణ్ ప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here