మంత్రి నారాయణ కుమారుడు కారు కొనుగోలు చేసింది ఎవరి దగ్గరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదం మరణం వెనక ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. కొనుగోలు చేసింది ఎవరి దగ్గరో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచే అంట. పవర్ స్టార్ ముచ్చటపడి కొనుక్కున్న మెర్సిడెజ్ బెంజ్ SUV కారును తొమ్మిది నెలల క్రితం అమ్మేశారు. అప్పట్లో ఈ వార్త సంచలనం. ఫారిన్ నుచి తెప్పించుకున్న ఈ కారును తనకు కావాల్సిన విధంగా కొన్ని మార్పులు కూడా చేశారు. తనకు ఎంతో ఇష్టమైన కారు కాబట్టే.. రాంచరణ్ పెళ్లి సమయంలో.. చెర్రీని ఇదే కారులో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మంటపానికి స్వయంగా తీసుకొచ్చాడు. ఏమైందో ఏమోగానీ.. గత ఏడాది 2016, జూలై ఈ కారును అమ్మేశారు.

అప్పట్లో ఎవరు కొన్నారా అని అందరూ ఆశ్చర్యం, ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నించిన ఫలితం లేదు. ఇప్పుడు తెలిసిన అసలు విషయం ఏంటంటే.. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ యాక్సిడెంట్ చేసిన.. ప్రాణాలు తీసుకున్న కారు అదేనని. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఈ కారును నారాయణకు అమ్మటం లేదు.. విరమించుకున్నాను అని చెప్పారంట పవన్. అయినా పట్టుబట్టి మరీ నారాయణ తన కొడుకు ముచ్చట తీర్చాడంట. అప్పట్లోనే పవన్ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. జాగ్రత్తగా వాడాలి.. నేను ఎంతో ముచ్చటగా చేయించుకున్నాను.. స్పీడ్ వద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పాడంట. నిషిత్ పవన్ కళ్యాణ్ అభిమాని.. అందుకే పవన్ కారు అమ్ముతున్నారు అని వార్త తెలియగానే.. తండ్రితో యుద్ధమే చేశాడంట.

పవర్ స్టార్ చేతులు పట్టుకున్న స్టీరింగ్ నేను పట్టుకోవాలని అని బలవంతం చేశాడంట. ఈ కారు విషయంపైనే నారాయణ రెండు, మూడు సార్లు పవన్ ను కలిసి మరీ ఒప్పించాడంట. చివరికి తనకు ఇష్టమైన హీరో కారులోనే ప్రాణాలు విడటవటం అతని స్నేహితులను కంటతడి పెట్టించింది. నిషిత్ మరణవార్త తెలిసిన వెంటనే.. పవన్ కళ్యాణ్ స్వయంగా అపోలో ఆస్పత్రికి రావటం.. కుటుంబ సభ్యులను ఓదార్చటం.. కన్నీటి పర్యంతం కావటం తెలిసిందే. నిర్జీవంగా పడి ఉన్న నిషిత్ ను చూసి చాలా ఎమోషన్ కూడా అయ్యారు పవన్.

 

Displaying IMG_1765.JPG

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here