పూరీ జగన్నాథ్ దెబ్బకి మాయమైన హీరో ఇప్పుడు మళ్ళీ సినిమా మొదలెట్టాడు…

పటాస్ సినిమా బ్లాక్ బస్టర్ పడ్డం తో తాను కూడా స్టార్ హీరోగా ఎదగచ్చు అనుకున్న కళ్యాణ్ రాం కి వరస సినిమాల ప్లాప్ మళ్ళీ షాక్ ఇచ్చింది. పటాస్ ఇచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకోలేక పోయిన కళ్యాణ్ రామ్ షేర్ తో హీరోగా ప్లాప్ ఇచ్చి పూరీ తో ఇజం తీసి మరింత ప్లాప్ కి చవి చూసాడు. పూరీ జగన్నాథ్ ని నమ్మి డబ్బులు కూడా పెట్టి ఇజం ని నిర్మించిన కళ్యాణ్ రామ్ ఆ సినిమా రిజల్ట్ తో కుదేలు అయిపోయాడు. ఇజం వచ్చి ఏడు నెలలు అయినా కూడా హీరోగా అతనికి కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు.

ఉపేంద్ర అనే కొత్త డైరెక్టర్ తో ఒక కథ ఓకే చేయించుకున్న కళ్యాణ్ రామ్ కొత్త నిర్మాతల తో నిర్మిస్తున్నాడు ఈ సినిమాని. ఇది ‘పటాస్’ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అట. ఉపేంద్ర ఇంతకుముందు ‘దూకుడు’, ‘ఆగడు’ లాంటి సినిమాలకు రచనా విభాగంలో పని చేశాడు. సో ఆ అనుభవం మీద ఎంటర్టైన్మెంట్ కి గ్యారెంటీ ఉంటుంది కదా అని కళ్యాణ్ రామ్ కూడా ఈ డైరెక్టర్ కి ఓకే చెప్పేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here