చరణ్ కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన కొరటాల శివ ?

కొరటాల శివ ప్రెజెంట్ భరత్ అనే నేను .. చిత్రం కోసం బిజీ అవుతున్నాడు. మహేష్ మురుగాదాస్ తో సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న కొరటాల శివ పూర్తిగా తన స్క్రిప్ట్ ని సిద్దం చేసుకున్నాడు. జనత గ్యారేజ్ తర్వాత కొరటాల శివ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. త్రివిక్రమ్ రేంజ్ డైరెక్టర్ గా మారిపోయిన కొరటాల శివ ఎలేవేషన్ లని మాత్రం బోయపాటి శ్రీను లెక్కలో చూపిస్తున్నాడు. ఇప్పుడు కొరటాల శివ మైండ్ అంతా భరత్ అనే నేను స్టోరీ మీదనే ఉంది. మరి ఈ చిత్రం తరవాత శివ ఏ సినిమా చేస్తాడు అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

ఎందుకంటే శివ ఈ చిత్రం తరవాత ఎన్టీఆర్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. మహేష్ సినిమా తరవాత అది చెయ్యాలి కానీ మధ్యలో చరణ్ తో ఒక సినిమా కోసం డిస్కషన్ లు కూడా జరిపాడు. ఆమధ్య చరణ్‌ ఎక్కడ వున్నా పక్కన కొరటాల కూడా కనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయిందనే అనుకున్నారు. కానీ తాజా పరిణామాల బట్టి చరణ్‌తో ప్రాజెక్ట్‌ కొరటాల డ్రాప్‌ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ప్రొడ్యూసర్ లు ఆసక్తి చూపిస్తూ ఉండడం తో చరణ్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్టు చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here