మహేష్ బాబు ఫాన్స్ కి ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఉండదు ..

మహేష్ బాబు స్పైడర్ సినిమా దాదాపు తొమ్మిది నెలల క్రితమే మొదలు పెట్టాడు. బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉండగానే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేసిన మహేష్ బాబు ఆ సినిమా షూటింగ్ నెలల తరబడి కానిస్తున్నాడు. జూన్ పోయి ఆగస్ట్ ని విడుదల తేదీగా ప్రకటించిన మేకర్ లు మురుగదాస్ ని నమ్ముకుని ఉన్నారు. మరొక పక్క ఫాన్స్ కూడా ఈ చిత్రం ఆగస్ట్ లో పక్కా వచ్చేస్తుంది అనే నమ్ముతున్నారు కూడా. కానీ ఎవ్వరికీ తెలీని న్యూస్ ఏంటంటే ఆగస్ట్ నెలాఖరు వరకూ ఈ సినిమా విడుదల అవ్వడం కష్టమే ఆగస్ట్ నెలాఖర్లో కూడా గ్యారెంటీ లేదు అంటున్నారు.

ప్రస్తుతం ఏప్రిల్‌ నెలలో కేవలం అయిదు రోజుల వర్క్‌ మాత్రమే జరిగిందని, మే నెలలోను ఇంతవరకు ప్లాన్‌ ప్రకారం షూటింగ్‌ జరగలేదని చెబుతున్నారు. సో అనుకున్న ప్రకారం జూన్ ఎండ్ కి షూటింగ్ పూర్తవ్వకపోతే విజువల్ ఎఫ్ఫెక్ట్ లు యాడ్ చెయ్యడానికి నెల రోజులు అయినా కావాలి. ప్రస్తుత ప్రోగ్రెస్‌ చూస్తే ఇది దాదాపు అసాధ్యమనేది ఈ గాసిప్స్‌ సారాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here