అల్లూ అరవింద్ ఐదొందల కోట్ల సినిమా .. ఒద్దు ఒద్దు అంటున్న విశ్లేషకులు

బాహుబలి ఇచ్చిన ఉత్సాహం తో అందరూ ఎగబడి మరీ భారీ చిత్రాలకి కాలు దువ్వుతున్నారు. రాజమౌళి తీసాడు మేము మాత్రం తీయలేమా అనుకుంటూ సినిమాల వైపు ఎగబడుతున్నవారు ఎందరో ఉన్నారు. మోహన్ లాల్ ఇప్పటికే వెయ్యి కోట్లతో మహా భారతం ప్రకటించిన తర్వాత తాజాగా అల్లూ అరవింద్ ఐదొందల కోట్ల రామాయణం అంటూ సిద్దమయ్యారు. హిందీలో ఆమిర్ ఖాన్ ఇప్పటికే తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా కోసం ఐదొందల కోట్లు ఖర్చు పెట్ట బోతూ ఉండగా అల్లూ అరవింద్ ఈ రకమైన షాక్ ఇవ్వడమ ఆశ్చర్యం.

హీరో హీరోయిన్ లూ డైరెక్టర్ టెక్నీషియన్ పేరు రాలేదు కానీ ఈ సినిమా మాత్రం ఉండబోతోంది అని అల్లూ అరవింద్ స్వయంగా చెప్పారు. ఇదే విషయాన్ని తరన్ ఆదర్శ్ కూడా ధృవీకరించారు. రామాయణం మీద తరచూ సినిమాలు , సీరియల్స్ ఉన్నాయి కాబట్టి భారతం మీద ఆయన దృష్టి పెట్టాలి అనీ రామాయణం జనం అంత ఆసక్తిగా చూడరు అనీ తెలిసిపోయిన కథ కి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here