ఎన్టీఆర్ బయోపిక్ విషయం లో తేజ కి అప్పుడే తలకాయ నొప్పులు మొదలు

దర్శకుడు తేజ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా డైరెక్టర్ తేజ తలనొప్పి తీసుకొస్తుంది.సినిమాలో పాత్రలు ఎంచుకోవడానికి తల పట్టుకోవాల్సి వస్తుంది.ఎన్టీఆర్ సినిమా అంటే అటు సినీ రంగం,ఇటు  రాజకీయం లో ఉన్న పాత్రలను తెరకెక్కించలి.ఇప్పుడు డైరెక్టర్   తేజ ముందున్న అసలు సమస్య ఏమిటంటే సినిమాకి  సంబంధించి కాస్టింగ్‌. ఎన్టీఆర్ క‌థంటే.. ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌, సావిత్రి ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని చూపించాలి.

ఏ పాత్రకు ఎవర్ని తీసుకోవాలని డైరెక్టర్ తేజ తర్జన భర్జన పడు తున్నాడు.మరిముఖ్యంగా  అక్కినేని నాగేశ్వరావు పాత్రకు ఎవరిని తీసుకోవాలో తేజ కి అర్థం కావడం లేదు. ఆ పాత్రకు అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరైనా చేస్తే బాగుంటుందని బాలయ్యకు సూచించారు…అయితే ఈమధ్య అక్కినేని కుటుంబానికి నందమూరి కుటుంబానికి చాలా దూరం ఏర్పడటంతో బాలకృష్ణ గట్టిగా నో చెప్పినట్టు  సమాచారం.

అంతేకాకుండా సినిమాలో వీలైనంతవరకూ తక్కువ పాత్రలో సినిమా పూర్తిచేయాలని దర్శకుడు తేజ కు బాలయ్య  బాబు సూచించినట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాత  బాలకృష్ణ ఉన్నాడు.మరి దర్శకుడు తేజ ఈ తలనొప్పులను అధిగమించి ఎలా బయటపడతడో ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here