అబ్బో అజ్ఞాత వాసి లో ఆ సీన్ లే హై లైట్

మాటల మాంత్రికుడి  త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ విడుదల కావడానికి సిద్దంగా ఉంది. మామూలుగా త్రివిక్రమ్ సినిమాలు పంచులు ఒక రేంజులో పేలుతాయి.తన సినిమా కొచ్చిన సగటు ప్రేక్షకుని నవ్వించకుండా  ఏమాత్రం ఉండడు దర్శకుడు త్రివిక్రమ్.ఈ క్రమంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఫస్టాఫ్ బాగా వచ్చినా సెకండాఫ్లో సినిమాలో మేటర్ అంతగా లేకపోయినా బ్రహ్మానందం ఎపిసోడ్ తో అద్భుతంగా సినిమాను చివరిదాకా లాక్కొచ్చిన ఘనత డైరెక్టర్ త్రివిక్రమ్ ది.

ఇదే ఫార్ములాను  ‘అజ్ఞాతవాసి’ సినిమాలో వాడుతున్నట్లు ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న మాట… సినిమా కోసం రెండు వెరైటీ క్యారెక్ట‌ర్ల‌ని డిజైన్ చేశాడు త్రివిక్ర‌మ్‌. అదే.. వ‌ర్మ‌, శ‌ర్మ‌ రావు ర‌మేష్ ఏమో వ‌ర్మ‌.. ముర‌ళీ శ‌ర్మ ఏమో.. శర్మ‌. సినిమా మొత్త‌మ్మీద వీళ్ల‌ది ఓ సెప‌రేట్ ట్రాక్ రూపంలో న‌డుస్తుంటుంది. వీళ్ల మ‌ధ్య పేలే పంచ్‌లు.. భ‌లేన‌వ్వించ‌బోతున్నాయ‌ట‌.

అలాగే నటుడు ర‌ఘుబాబు సినిమా లో ఒక పెద్ద ధనవంతుడుగా కనిపించబోతున్నాడు….తనను ఆట పట్టిస్తూ సాగే పాటే కొడకా కోటేశ్వరరావు. ఈ పాటకు ముందు సినిమాకు హైలైట్ గా నిలిచే పదిహేను నిముషాల ఎపిసోడ్, సినిమా మొత్తానికి హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వర్మ ,శర్మ లు తెలుగు ప్రేక్షకుల నవ్వులు పూయించడానికి వెండితెర మీద సిద్ధంగా ఉన్నారన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here