నంద్యాల ఉప ఎన్నిక ప్రజలు .. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ సూపర్ సందేశం ఇచ్చారు :

దేశవ్యాప్తంగా ఆసక్తిన రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పుడిప్పుడే ఓటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు నంద్యాల వాసులు. ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ మొదలు అవ్వగా క్యూ లైన్ లు ఎనిమిది గంటలు అయ్యే సరికి నిండిపోయాయి కూడా. పోలింగ్ బూత్ ల దగ్గర ప్రజల సందడి తీవ్రంగా నెలకొంది. ఓటు వెయ్యాలి అనే చైతన్యం ప్రజల్లో స్ట్రాంగ్ గా కనిపించింది. ఓటింగ్ మొదలైన నాలుగు గంటల ప్రాంతం లోనే యాభై శాతం పోలింగ్ పూర్తి అవ్వడం విశేషం. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగుతూ ఉంటుంది.

ఈ నేపధ్యం లో అధికారులు వారి అనుభవం మేరకు చెప్పే విషయం ఏంటంటే ఈ ఓటింగ్ శాతం ఎనభై నుంచీ తొంభై వరకూ చేరేలాగా ఉంది అంటున్నారు. ఏదేమైనా ఒక ఉప ఎన్నిక కి ఈ రేంజ్ లో ఓట్లు పోల్ అవ్వడం చాలా పెద్ద వింతగా చెప్పాలి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ ఒక కనువిప్పు లాంటిది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని పోలింగ్ శాతాన్ని నంద్యాల రికార్డు గా నమోదు చేసుకునే క్రమం లో చూసుకుంటే మనం చాలా నేర్చుకోవాలి. జెనెరల్ ఎలక్షన్ ల టైం లో ఓటింగ్ శాతం తక్కువ పెట్టి లోక్ సత్తా లాంటి పార్టీలని ఓడించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here