షూటింగ్ లోంచి సడన్ గా పారిపోయిన హీరోయిన్ అమలపాల్ .. అసలేమైంది ?

హీరోయిన్ అమల పాల్ అంటే తమిళ, తెలుగు ప్రజలకి సుపరిచితమే.తెరమీద  హీరోయిన్ గా కంటే తెర వెనకాల నిరంతరం కాంట్రవర్సీ ల చుట్టూ తిరిగే హీరోయిన్ గా ఆమె అందరికీ తెలుసు. పెళ్లి, ప్రేమ , ఎఫైర్ లు ఇలా ఏదో ఒక విషయం లో ఆమె వారానికి ఒకసారి న్యూస్ లో ఉంటుంది. ఈ సారి కూడా ఆమె చిన్న సరదా వివాదం కి సంబంధించి న్యూస్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుట్టుపయేలే అనే తమిళ చిత్రానికి సీక్వెల్ తీయడం లో బిజీ గా ఉంది ఆమె. ఈ సినిమా కి సంబంధించి ఒక సరదా సంఘటన చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సూసీ .. ” ఆ రోజు మేము థాయ్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నాము.

చుట్టూ సముద్రం , పర్వతాలు ఉన్నాయి మాకు అక్కడ సెల్ ఫోన్ లో సిగ్నల్స్ అనేవి లేవు.ఈ లోగా కొంచెం ఉన్న సిగ్నల్ లో అమల కి ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ కి సీరియస్ గా ఉంది అనేది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే ఆమె సిగ్నల్స్ సెర్చ్ చేసుకుంటూ దూరంగా పరిగెత్తింది. మాకేమో విషయం తేలేదు. ఆమె పారిపోతోంది అని మేము అనుకున్నాం. ఇంతకీ విషయం ఏంటంటే ఆమె ఫాదర్ కి ఒంట్లో బాగానే ఉంది కావాలనే వాళ్ళ అమ్మగారు అలా మెసేజ్ పెట్టారు .. ఇదంతా మా సినిమా షూటింగ్ లో చాలా సెన్సేషన్ సృష్టించింది. ” అని చెప్పుకొచ్చాడు సుసీ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here