జై లవ కుశ ఆడియో కి గెస్ట్ ఎవరో తెలుసా ? చెప్తే ఎన్టీఆర్ ఫాన్స్ ఎగిరి గంతేస్తారు

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో నడుస్తోంది.ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో చేసిన టెంపర్, నాన్నకు ప్రేమతో , జనత గ్యారేజ్ తరవాత క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతోంది జై లవ కుశ .. జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తూ మూడు పాత్ర లలో జై, లవ , కుశ గా రాబోతున్న ఈ చిత్రం మీద ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్ లకి కూడా విపరీతమైన అంచనాలు ఉండనే ఉన్నాయి. డైరెక్టర్ బాబీ అవ్వడం కూడా ఎక్స్ పెక్టేషన్ లు పెంచడం లో ఒక కారణం.

అతని గత చిత్రం సర్దార్ ప్లాప్ అయినా అతకు ముందర వచ్చిన పవర్ సినిమా జనాలకి బాగానే ఎక్కింది. ఇప్పట వరకూ జై , లవ ల పాత్రల ఫస్ట్ లుక్ లు బయట పెట్టిన డైరెక్టర్ , ప్రొడ్యూసర్ లు రేపు సాయంత్రం వినాయక చవితి సందర్భంగా కుశ లుక్ ని విడుదల చెయ్యబోతున్నారు. అయితే మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుక ని సెప్టెంబర్ 3 న గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్ లో హై లైట్ ఏంటి అంటే ఈ ఆడియో కి రాజమౌళి ని ముఖ్య అతిధి గా పిలుస్తున్నారు అని సమాచారం. రాజమౌళి షెడ్యూల్ బట్టి సెప్టెంబర్ 3 న లేదంటే నాలుగు న ఈ ఆడియో ఉండచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here