గ‌దులు లేవ‌న్నందుకు రోడుపై ప‌డుకున్న మాజీ గ‌వ‌ర్న‌ర్‌

కాలం ఎప్పుడెలా మారుతుందో…మ‌నుషుల‌కు కాకుండా ప‌ద‌వుల‌కు ప్రాధాన్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ .. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ బాడీ బిల్డర్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్నాల్డ్ హాలీవుడ్ సినిమాలతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కాలిఫోర్నియా 38వ గవర్నర్ గా కూడా పదవి బాధ్యతలను నిర్వర్తించాడు. 2011లో ఆర్నాల్డ్ పదవీ విరమణ చేశాడు. అంత‌టి ప్ర‌ముఖుడికి ఓ హోట‌ల్ షాక్ ఇచ్చింది.
గవర్నర్ గా ఉన్న సమయంలో ఓహియాలోని కొలంబస్ ఏరియాలోని ఉన్న ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆర్నార్ట్ అతిథిగా పాల్గొన్నారు. అప్పుడు హోటల్ నిర్వాహకులు తమ హోటల్ ఎదురుగానే ఆర్నాల్డ్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటల్‌కు  వచ్చినా.. ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని చెప్పారు. కట్ చేస్తే రీసెంట్ గా ఓ పనిమీద ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆర్నాల్డ్ హోటల్ లో బస చేసేందుకు రూమ్ కావాలని అడిగాడు. దీనికి హోటల్ సిబ్బంది గదులు ఖాళీగా లేవని సమాధానం ఇచ్చారట. దీంతో కలత చెందిన ఆర్నాల్డ్ హోటల్ ఎదురుగా ఉన్న తన విగ్రహం ప్రక్కనే పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి “కాలం ఎలా మారిపోయింది“ అనే కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, ఇటీవ‌ల చార్లెట్స్‌విల్లేలో జరిగిన హింసపై ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌నెగ్గర్ కొద్దికాలం క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్నాల్డ్‌ ఖండించారు. నయా-నాజీలకు ట్రంప్‌ మద్దతు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ బొమ్మను చేతిలో పట్టుకుని, ఆ బొమ్మకు జాతివివక్ష గురించి వివరిస్తూ అర్నాల్డ్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ద్వేషానికి రెండు తలలు ఉండవని, లక్షల మందిని చంపిన వ్యక్తుల వైపు నువ్వు నిలుచుంటే, దానికి రెండు దిక్కులు ఉండవని అర్నాల్డ్‌ అన్నారు. చార్లెట్స్‌విల్లే ఘటనపై మీడియా సమావేశంలో శ్వేతజాతి దురహంకారులను, మరో గ్రూప్‌ (రెండు వర్గాలను) తీరును ఖండించారు. ఇక్కడే ట్రంప్‌ ఎంచుకున్న విధానాన్ని ఆర్నాల్డ్‌ తప్పుబట్టారు. ద్వేషాన్ని జయించాలంటే, వాళ్లపై అంతకన్నా అధికంగా మన స్వరాన్ని వినిపించాలని ట్రంప్‌నకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here