హుషారులో హీరో రామ్‌..?

ఎనర్జిటిక్ హీరో రామ్ మంచి హుషారులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఊహించ‌ని విధంగా ఓ భారీ ప్రాజెక్టు ఆయ‌న్ను వెతుక్కుంటూ వచ్చిన‌ట్లు వార్త‌లు పుట్టుకొస్తున్నాయి.

గ‌తేడాది ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బంప‌ర్ హిట్ అందుకున్నారు రామ్‌. ఆ తర్వాత త‌మిళ్ మూవీ త‌డంను తెలుగులో రెడ్ పేరుతో రామ్ హీరోగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో రామ్ రెండు పాత్ర‌ల్లో నటిస్తున్నారు. క‌రోనా కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఇంత‌వ‌ర‌కు రిలీజ్ అవ్వ‌లేదు.

తాజాగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో వార్త‌లు షికార్ చేస్తున్నాయి. అత‌డు సినిమా నుంచి త్రివిక్ర‌మ్ స్టార్ హీరోల‌తోనే సినిమాలు తీశారు. ఇప్పుడు మాత్రం కాస్త త‌గ్గి రామ్‌తో సినిమా చేయాల‌ని భావిస్తున్నారంట‌. ఇక రామ్ ఇన్ని రోజులు ఏ సినిమాను ఓకే చెయ్య‌కుండా ఉన్న‌ది కూడా ఈ క్రేజీ ప్రాజెక్టుకోస‌మేన‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల టాక్ న‌డుస్తోంది.

ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ సినిమా చేస్తార‌ని తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్‌టి.ఆర్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల్సి ఉంది. అయితే రాజ‌మౌళి సినిమాలో ఇంకా ఎన్‌టిఆర్ తో షూట్ చేయాల్సింది చాలానే ఉందంట‌. ఇది త్వ‌ర‌గా అనుకుంటే మ‌రో ఆరేడు నెల‌లు ప‌డుతుంద‌న తెలుస్తోంది. దీంతో ఇన్ని రోజులు గ్యాప్ ఉండ‌కుండా రామ్‌తో త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే రామ్‌కు మ‌రో సూప‌ర్‌హిట్ మూవీ.. ప్రేక్ష‌కుల‌కు క‌డుపుబ్బా న‌వ్వే మూవీ వస్తున్న‌ట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here