రైనా అందుకే ఇలా చేశారా..?

మ‌హేంద్ర సింగ్ ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌క్ వీడ్కోలు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వెంట‌నే ఆల్‌రౌండ‌ర్ మ‌రో ఆట‌గాడు సురేష్ రైనా సైతం రాజీనామా చేశారు. అయితే ఇద్ద‌రూ ఒకే సారి రాజీనామా చేయ‌డంపై అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు.

ధోని రాజీనామా చేయ‌డంతోనే క్రికెట్ అభిమానులు షాక్‌కు గుర‌వుతుంటే ఆ వెంట‌నే రైనా రాజీనామా చేయ‌డం ఇండియ‌న్ క్రికెట్లో ఓ మ‌రిచిపోలేని రోజుగా మిగిలిపోతుందంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్లు జ‌ట్టును వీడి ఇండియా అభిమానుల‌ను మ‌నోవేధ‌న‌కు గురిచేశార‌ని చెప్పొచ్చు. అయితే వీరిద్ద‌రూ ఒకేసారి రాజీనామా చేస్తార‌ని మాత్రం ఎవ్వ‌రూ ఊహంచ‌లేదు.

అయితే ధోని త‌న రాజీనామాను ప్ర‌క‌టించిన కాసేప‌టికే రైనా కూడా ప్ర‌క‌టించేశారు. దీనిపై రైనా తాజాగా స్పందించారు. తాను ధోని రాజీనామా చేసిన వెంట‌నే రాజీనామా చేయ‌డానికి కార‌ణం ఏంటంటే ధోని జెర్సీ నంబ‌ర్ 7 అని, త‌న జెర్సీ నంబ‌ర్ 3 అన్నారు. అయితే ఇద్ద‌రి నంబ‌ర్లు క‌లిపితే 73 వ‌స్తుంద‌న్నారు. ఇక మ‌న దేశానికి స్వాతంత్య్రం వచ్చి కూడా 73 సంవ‌త్స‌రాలు అయ్యింద‌న్నారు. అందుకే తాను అదే రోజు త‌న రాజీనామా ప్ర‌క‌టించాన‌న్నారు.

ఇక ధోని, రైనా ఇద్ద‌రూ దాదాపుగా తక్కువ స‌మయంలోనే భార‌త జ‌ట్టులోకి వ‌చ్చారు. 2004లో ధోని, 2005లో రైనాలు అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. కాగా ధోని రాజీనామాపై ప‌లు రోజులుగా ఊహాగానాలు వ‌స్తూ ఉన్నా.. రైనా రాజీనామా మాత్రం అంద‌రినీ షాక్‌కు గురిచేసింద‌ని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here