గెట్ వెల్ సూన్ అంటూ ర‌జినీ ట్వీట్

క‌రోనాతో పోరాడుతున్న ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య పరిస్థితిపై సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఓ వీడియో పంపారు. బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు వీడియోలో రజినీ చెప్పారు.

క‌రోనాతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం విష‌మించిన విష‌యం తెలియ‌డంతో ఆయ‌న అభిమానులు, హీరోలు వేగంగా స్పందించారు. అయితే ప్ర‌స్తుతం బాలు ఆరోగ్యం బాగానే ఉంది. ఈ మేర‌కు ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు వెల్ల‌డిస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం బాలు కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక రజినీకాంత్ మాట్లాడుతూ బాలు క‌రోనాతో పోరాడుతున్నార‌న్న విష‌యం త‌న‌కు ఇటీవ‌లె తెలిసింద‌న్నారు. ఆయ‌న వేగంగా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. గెట్ వెల్ సూన్ అంటూ ర‌జినీ ట్వీట్ చేశారు. ఇక బాలు ఆరోగ్యంపై క‌మ‌ల హాస‌న్‌, మోహ‌న్‌బాబు ఖుష్బూలు స్పందించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలన్నారు.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ నెల 5వ తేదీన క‌రోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్లో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స‌లు అందిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here