తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..?

కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనాపై తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందిందని తీవ్ర స్థాయిలో విమర్శలు కేసీఆర్ పై వచ్చి పడ్డాయి. టెస్టులు సహా హాస్పిటల్స్ లో కరోనా సోకిన వారికి సరైన ట్రీట్మెంట్ కూడా లేదని పెద్ద ఎత్తునే వ్యతిరేకత మొదలు కావడంతో సర్కార్ టెస్టుల విషయంలో మరింత స్పీడ్ పెంచింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడు తెలంగాణలో రోజుకు దాదాపు 20 వేలు టెస్టులు నిర్వహిస్తుండగా దానిని 40 వేలుకు పెంచాలని ఆదేశాలు జారీ చేసారట. అందుకు గాను 100 కోట్ల నిధులను కూడా ఈ బుధవారం విడుదల చేసినట్టు సమాచారం. దీనితో కరోనాకు సంబంధించిన వైద్య సామగ్రి అంతా సమకూర్చాలని కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ వారం నుంచి తెలంగాణలో కరోనా సంఖ్య ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here