విస్తరిస్తున్నమరో వైరస్.. చైనాలో ఏడుగురు మృతి..!

ప్రస్తుతం దేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది చైనాలో ఇప్పుడు అదే చైనాలో కొత్త వైరస్‌ విజృంభిస్తుంది. ఆ వైరస్ పేరు SFTS.

అయితే గత కొద్ది రోజులుగా చైనాలో SFTS అనే వైరస్ విజృంభిస్తూ వస్తుంది. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో జూలైలో 37 మంది, అన్‌హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకగా, తాజాగా ఈ వైరస్ బారిన పడి మరో 7 మంది చనిపోయినట్టు సమాచారం.

దగ్గు, జ్వరం ఈ వైరస్‌కు లక్షణాలు కాగా, శరీరంలోని ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. 2011లోనే కనుగొన్న ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా సంక్రమిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ వైరస్ తో మరో ముప్పు పొంచివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here