మంచు కుటుంబం నుంచి మరో కొత్త ఓటిటి..?

ఈ రోజుల్లో ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ వుంది, అలాగే ఇప్పుడు ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ ఓటీటీ సంస్థ కూడా ఉండబోతుంది. కరోనా వాళ్ళ ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోంది. టీవీ ఛాన‌ళ్ల‌లానే వాటి సంఖ్య కూడా పెర‌గ‌బోతోంది. ప్ర‌ముఖ నిర్మాత‌లు ఓటీటీ సంస్థల్ని స్థాపించ‌డానికి మొగ్గు చూపిస్తున్నారు. అందులో భాగంగానే మంచు వారి కుటుంబం నుంచి ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

మంచు విష్ణు ది కాస్త బిజినెస్ మైండ్‌.ఇప్పటికే చాలా బిజినెస్ లు ప్రారంభించాడు. ఇప్పుడు ఓటీటీ ఆలోచ‌న చేస్తున్నాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లెట్టిన‌ట్టు స‌మాచారం. మంచు ఫ్యామిలీ నుంచి యేడాదికి క‌నీసం నాలుగైదు సినిమాలైనా వ‌స్తుంటాయి. అంతేనా విష్ణు వెబ్ సిరీస్ రంగంలోనూ అడుగుపెట్టాడు. జీ 5 కోసం `చ‌ద‌రంగం` అనే వెబ్ సిరీస్ నిర్మించాడు. అదే కోవ‌లో మ‌రిన్ని వెబ్ సిరీస్‌ల‌ను విష్ణు నిర్మించబోతున్నాడు. అవన్నీ స్వయంగా తన ఓటీటీ ప్లాట్ఫారం లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నాడని సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here