జరిగిన హల్దీ వేడుక.. సీ షెల్స్ నగలతో మెరిసిన మిహీక

నటుడు రానా మరియు మిహీక పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి ముందు జరగాల్సిన కార్యక్రమాల హడావిడి ఇరు  కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. ముఖ్యంగా  వధువు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో సీ షెల్స్ నగలతో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే హల్దీ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు.

కాగా రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న  రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. రానా, మిహీకా కుటుంబాల నుండి 30 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్ లో ఉన్నట్టు  సురేష్ బాబు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here