వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని తెలుగుదేశం పార్టీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది అంటున్నారు చాలామంది రాజకీయ నిపుణులు, ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీ గెలవడం చాలా కష్టం అంటున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ  వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఉన్నా ప్రజా వ్యతిరేకతను తనవైపు మలుచుకుంటూ అడుగులు వేస్తుంది వైసీపీ పార్టీ. ఈ  క్రమంలో వచ్చే ఎన్నికలలో గెలుపు కష్టంగా ఉన్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తోక్కడానికి తెరలేపింది.

ఇక ఎక్కడైయితే వైసీపీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాలలో ఓట్లను గల్లంతు చేస్తున్న తీరుపై ఆ వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడి రిటర్నింగ్ అదికారి శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు కుమ్మక్కై పదిహేనువేల ఓట్లు తీయించేశారని వైసీపీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ఆరోపించారు.చివరికి తన ఓటు,తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తీయించేశారని ఆయన చెప్పారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమని ఇప్పుడే భావించినట్లు ఉంది తెలుగుదేశం పార్టీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here