వైసీపీ టు బిజెపి వయా తెలుగుదేశం: కొత్తపల్లి గీత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ నుండి గత ఎన్నికల్లో గెలిచి తరువాత అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినా వైసిపి ప్రజాప్రతినిధులు బిజెపి వైపు చుస్తున్నారట. అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.

తాజాగా బడ్జెట్ ప్రకటించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఎంపీలు కేంద్రం పై విరుచుకు పడుతున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే.అయితే వైసీపీ నుండి టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎంపీలు ఏమి స్పందించకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాలు.ఇలాంటి సమయంలోనే తెరపైకి వచ్చారు కొత్తపల్లి గీత.

ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెగ బాధపడుతున్న టీడీపీ నేతలు, చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా కేంద్ర సర్కారు కేటాయించిన నిధులకు లెక్కలు ఎందుకు చెప్పడంలేదు అంటూ విరుచుకుపడ్డారు ఎంపీ కొత్తపల్లి గీత. ఈ క్రమంలో కొత్తపల్లి గీత బిజెపి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చింది. తాజాగా కొత్తపల్లి గీత చేస్తున్న వ్యాఖ్యల బట్టి ఆమె బిజెపి పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకనే తెలుగుదేశం పార్టీ ని ఇంతలా విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here