వైయస్ జగన్ కి పోయేకాలం దగ్గర పడింది: టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ కి పోయేకాలం దగ్గర పడింది అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పోరాడుతుంటే ప్రతిపక్షనేత అధికారం కోసం రాష్ట్రంలో రోడ్డుమీద తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…వైయస్ జగన్ ఉదయం మంచం మీద నుంచి లేచిన‌ప్ప‌ట్నుంచి, మ‌ళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్నారు.

చంద్ర‌బాబుపై ఇప్ప‌టి చేసిన విమ‌ర్శ‌ల‌ను నిరూపించ‌గ‌లవా..? అంటూ వైఎస్ జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు.వైసీపీకే ఓట్లు వేయ‌మంటే వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టినుంచే ఎన్నిక‌ల‌ ప్ర‌చారం చేప‌ట్టార‌ని, ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా జ‌గ‌న్ మాట‌ల‌ను విశ్వ‌సించ‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదానే లక్ష్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేస్తుంటే వైఎస్ జ‌గ‌న్ మాత్రం సీఎం పీఠం కోసం పాకులాడుతూ ఏపీలోనే తిరుగుతున్నార‌న్నారని విమ‌ర్శించారు. ఏపీ ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపడుతుంది అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here