ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హీరో రాజశేఖర్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ  క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభం అత్యంత వైభవంగా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖల మధ్య కన్నుల పండుగగా జరిగింది. భారీ తారాగణంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో ఈ సినిమాలో ఎన్టీ రామారావు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో హీరో రాజశేఖర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజశేఖర్ నటించిన  ‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో రాజశేఖర్ బాలకృష్ణ సినిమాలో చిన్నపాత్రలో నటించే అవకాశం ఇచ్చినా చేస్తానని ఆమధ్య అనడం జరిగింది…ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న బాలకృష్ణ చిన్న పాత్ర ఎందుకు ఇద్దరం కలిసి నటిద్దామని పేర్కొన్నారు. దీంతో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో చంద్రబాబు పాత్రకి హీరో రాజశేఖర్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here