ఓవర్సీస్ లో కలక్షన్ల దుమ్ము దులుపుతున్న రంగస్థలం

రామ్‌చ‌ర‌ణ్ నటించిన రంగస్థలం సినిమా వసూళ్లు ఓ రేంజిలో రాబడుతుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం విదేశాలలో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నైజాంలో కలక్ట్ చేస్తున్నట్లు ఓవర్సీస్లో అద్భుతంగా కలెక్షన్లు సాధిస్తుంది.అయితే విడుదల తెలుగు రాష్ట్రాలలో తొలి వీకెండ్ నాటికి 40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ప్రస్తుతం ఓవర్సీస్లో  అమెరికాలో తొలి రెండ్రోజుల్లోనే మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో అడుగుపెట్టింది ఈ చిత్రం. అయితే ఫుల్ ర‌న్‌లో కేవ‌లం అమెరికా నుంచి మూడు మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది ట్రేడ్‌. అంటే ఈ సినిమా అమెరికా నుంచి ఏకంగా రూ.20 కోట్ల వ‌సూళ్లు సాధించ‌నుంద‌న్న‌ది అంచ‌నా.

అంటే ఓ ర‌కంగా అమెరికా నుంచి నైజాం నుంచి తెచ్చినంత తేబోతోంద‌న్న‌మాట‌!. మొత్తంమీద రంగస్థలం బాహుబలి తర్వాత 3 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో అడుగుపెడుతున్న సినిమా అని చెప్పవచ్చు. మరోవైపు రాంచరణ్ మార్కెట్ ఓవర్సీస్లో రోజురోజుకి పెరిగిపోతుంది. గతంలో విడుదలైన `ధ్రువ` 1 మిలియ‌న్ డాల‌ర్ సాధించి చేర్రికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ తెచ్చిపెట్టింది. మొత్తంమీద ప్రస్తుతం రంగస్థలం సినిమా కలెక్షన్లు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక రికార్డులు సృష్టించే సినిమాగా  ఉంది అని అంటున్నారు ట్రేడ్ వర్గ పండితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here