అదే బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తున్న సుకుమార్

రంగస్థలం సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భయంకరంగా కలెక్షన్ల సాధిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్ మరో రెండు సినిమాలు అదే బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ లో చేయడానికి సిద్ధమై పోయాడు. ప్రస్తుతం రంగస్థలం తెలుగు ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టిస్తుంది. పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. దీంతో తమ బ్యానర్లో చాలా పెద్ద హిట్ కొట్టిన సుకుమార్ కి మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు సినిమాలు చేయాలని ఆఫర్ ఇచ్చారట.

శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీస్ కొత్త తరహా సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య, రవితేజ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ తో   మరో సినిమా చెయ్యడానికి సిద్ధం అయిపోయారు మైత్రి మూవీ మేకర్స్ వారు. మరి సుకుమార్ తర్వాత సినిమాల హీరో ఎవరో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here