చంద్రబాబుకి సీబీఐ కేసుల భయం పట్టుకుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారట…అని తెలుగుదేశం పార్టీ ఆస్థానం మీడియా కథనాలు ప్రచురిస్తుంది. అయితే ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం చంద్రబాబు తన కేసుల విషయమై ఢిల్లీలో ఉన్న లాయర్లను అడిగి తెలుసుకోవడానికి వెళ్లారని అంటున్నారు. అయితే మరోపక్క గత కొంతకాలంగా బిజెపి పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య తీవ్ర వైరుధ్యం నెలకొనడంతో  రెండు పార్టీలకు సంబంధించిన నాయకులూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఈ తరుణంలో కేంద్రం నుండి టీడీపీ ,రాష్ట్ర ప్రభుత్వం నుండి బీజేపీ పార్టీలు బయటకు వచ్చాయి. ఇట్లాంటి సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారుకు ఏపీ ప్రజలకు న్యాయం చేయడానికి ఏవిధంగా ఎప్పుడు ఎన్ని నిధులు కేటాయించామనే పలు అంశాలతో కూడిన లేఖను విడుదల చేస్తూ.ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలంటూ ఒక లేఖను విడుదల చేశారు.

దీంతో ఎక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా దోచుకుతింటున్నరో ..ఎన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారో పూర్తీ వివరాలతో అమిత్ షా దగ్గర ఆధారాలున్నాయి.ఇప్పుడు ఒకవేళ ఆయన తోక జాడిస్తే ఎక్కడ సీబీఐ కేసులు ,కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అని భయపడి కేంద్రంలో ఉన్న పెద్దలందర్ని కల్సి లాలుచి పడాలని ఢిల్లీ వెళ్ళుతున్నారు అని అంటున్నరు…రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర అవినీతి జరుగుతుందన్ని కేంద్రానికి రాష్ట్రం నుండి చాలా లేఖలు కూడా అందాయట. దీంతో చంద్రబాబు కూడా కొంత కంగారు పడుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here