విదేశాలలో విజయ్ మాల్యా ని కలిసిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటు సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద గజదొంగ  ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు విదేశాలలో దచుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త మాజీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని దేశంలో అనేక బ్యాంకులకు టోపీ పెట్టి దర్జాగా విదేశాలు పారిపోయిన విజయ్ మాల్యా ని విదేశాలలో చంద్రబాబు కలిశారట.
విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సరిగ్గా రెండు యేండ్ల కిందట అంటే 2016 మార్చి నెలలో లండన్ లో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయ మాల్యాను కలిశారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు..అక్కడితో ఆగకుండా పార్టీ విరాళం కోసం ఏకంగా నూట యాబై కోట్ల రూపాయలను తీసుకున్నారు.ప్రస్తుతం ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసమే ..ఎక్కడ కేంద్రం సీబీఐ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తుందేమో అనే భయంతో ఆయన వెళ్ళుతున్నారు అని ఆయన ఆరోపించారు ..ఇటువంటి వ్యక్తి ని రాష్ట్రంలో ఉన్నయెల్లో మీడియా కాపాడుతూ ప్రజలను మోసం చేస్తోంది అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నంతవరకూ అభివృద్ధి జరగదని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here