ఏప్రిల్ 7న మహేష్ బాబు బహిరంగ సభ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్, సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరదలిని లు సినిమాలో మహేష్ బాబు ముఖ్య మంత్రి పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ గ్రామంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటిస్తున్నామని, ఈ వేడుకకు అందరూ హాజరవుతారని భావిస్తున్నట్టు ఆ ట్వీట్ లో మహేశ్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు ‘భరత్ అనే నేను’ పోస్టర్ ను మహేశ్ పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ‘బహిరంగ సభ’గా అభివర్ణించడం ఆసక్తిదాయకం. అయితే ఈ వేడుకకు ఎన్టీఆర్ రాంచరణ్ ముఖ్య అతిథులుగా వస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here