‘రంగస్థలం’ సినిమా చూసి నాన్న నన్ను కౌగిలించుకున్నారు: రామ్ చరణ్

వేసవి కానుకగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో మొట్టమొదటిగా విడుదలయిన రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా అద్భుతమైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రంగస్థలం సినిమా విడుదలైన ప్రతి చోటా హిట్ టాక్ కైవసం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమా లో రాంచరణ్ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ నటుడిగా ఓ మెట్టు ఎక్కడని అంటున్నారు.
ఈ విషయం గురించి చరణ్ స్పందిస్తూ ..చిట్టిబాబు గా మళ్ళీ పుట్టినట్టనిపించిందని అన్నారు. సుకుమార్ పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా విజయానికి కారణం అని, ప్రతి విషయంలో యూనిట్ తీసుకున్న జాగ్రత్తలే .. ఇలాంటి గొప్ప సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. సినిమా చూసాక నాన్న గట్టిగా కొగిలించుకుని అద్భుతంగా చేసావని చెప్పడం గొప్పగా ఉందని చెప్పాడు చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here