సినీ ఇండస్ట్రీలో లైంగిక వేదింపుల విషయంలో స్పందించిన జగపతిబాబు

ప్రస్తుతం సినిమా రంగంలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు విషయంలో అనేక ఇండస్ట్రీలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇటీవల ఈ విషయంపై తెలుగు సినిమా రంగంలో చాలా మంది ప్రముఖులు బహిరంగంగానే స్పందించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రస్తుతం విలన్ ల పాత్ర పోషిస్తున్న జగపతిబాబు స్పందించరు. జగపతి బాబు మాట్లాడుతూ అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఒక్క సినిమా పరిశ్రమలోనే లేవని, అన్ని రంగాల్లో ఆడవాళ్లపై ఈ వేధింపులు జరుగుతున్నాయని అన్నాడు.
ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతుందని అన్నారు. ఎవరైనా సరే సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు ఇస్తామని అంటే అందుకు అమ్మాయిలు గట్టిగా నిరాకరించాలని చెప్పారు. సినిమా రంగం సురక్షితమైందే అని అయన అభిప్రాయం పడ్డారు. అంతేకాకుండా తన కుమార్తెలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడతాం అంటే ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here