వైయస్ జగన్ ఓ పెద్ద సైకో

కడప జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసిపి అధినేత జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. అస‌లు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాల‌ని కోరుకునే వ్య‌క్తుల్లో వైఎస్ జ‌గ‌న్ ముదు వ‌రుస‌లో ఉంటార‌ని ఎద్దేవ చేశారు మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి.
అధికార పార్టీ వాళ్ల‌ను కాల్చేస్తా.., చంపేస్తా, చొక్కా విప్పుతా, నిక్క‌రు విప్పుతా, అమ్మ‌కు పుట్టావా..? అబ్బ‌కు పుట్టావా..? వ‌ంటి ప‌దాల‌ను ఉప‌యోగిస్తున్న జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు నూటికి నూరు శాతం అన్‌ఫిట్ అని తేల్చేశారు. వైయస్ జగన్ ఓ సైకో అని అన్నారు…ఇటువంటి వ్యక్తి జైల్లోనే ఉండాలి…బయట సమాజంలో ఉంటే తన అధికార దాహం కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కుల్చుతాడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడు అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజల సమస్యల గురించి కాదు తాను ముఖ్యమంత్రి అవ్వాలని చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో చంద్రబాబు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here