తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ బీజేపీలోకి వెళుతున్నారు

వైసిపి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక త్వరలో పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున నిలబడి గెలిచిన బుట్టా రేణుక తరువాత కొన్ని పరిణామాల వలన తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లిపోయింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె కొన్నాళ్లు వార్తల్లో నిలిచింది… తరువాత జాడే లేకుండా పోయింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నా ప్రత్యేక హోదా ఉద్యమాల పుణ్యమా అని మరల తెరపైకి వచ్చారు.అయితే ఈ సారి మాత్రం ఆమె ఏకంగా పార్టీ మారతారు అని వార్తలు వస్తున్నాయి.
అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో .అసలు విషయానికి వస్తే ప్రస్తుతం గత పది రోజులుగా వైసీపీ ,టీడీపీ పార్టీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూ వస్తున్న సంగతి విధితమే. ఈ తరుణంలో ఆమె టీడీపీ పార్టీకి మద్ధతుగా పార్లమెంటులో నిలబడితే వైసీపీ పార్టీ తనపై సస్పెన్శన్ వేటు వేయమని కొరుతుంది.దీంతో తన పదవీ ఊడుతుంది.ఒకవేళ టీడీపీలో ఉంటే మరల గెలిచే అవకాశం లేదు..వైసీపీలోకి వేళ్ళే పరిస్థితి లేదు ..ఒకవేళ వెళ్ళిన జగన్ మరల సీటు ఇస్తాడని నమ్మకం లేదు .
సో ఇలా జరగడం ఇష్టం లేక ఆమె పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అంట.బీజేపీలో చేరితే ఎటువంటి సమస్య ఉండదని ఆమె అభిప్రాయం కావచ్చు. మరి రాబోయే ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున రేణుకకు టిక్కెట్ వస్తుందో లేదో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here