రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్

రంగస్థలం భారీ విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమా లో రాంచరణ్ నటనకు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖుల నుండి అభినందనలు..ప్రశంసలు అందాయి. చిట్టిబాబుగా చరణ్ వెండితెర మీద అదరగొట్టాడు. మొత్తంమీద చరణ్ గతంలో ఉన్న చిత్రాల కంటే చాలా మెరుగు పడిందని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చరణ్ కు తన బాబాయ్ పవర్ స్టార్ నుండి కూడా అభినందనలు రావడంతో మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ఖుషి అవుతున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వేసి మరి చూపించాడు చరణ్ .. ఈ సినిమా చుసిన పవన్, చరణ్ ని పొగడకుండా ఉండలేకపోయాడట. ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయి నటించాడు చరణ్. చిట్టి బాబు పాత్రలో జీవించాడు అని చెప్పడమే కాకుండా శ్రీ రామ్ చరణ్ గారికి అంటూ సంబోదించి .. అభినందనలు తెలిపినా డైరెక్ట్ గా మాత్రం నువ్వు లక్కిరా అన్నాడట, నా కెరీర్ మొత్తంలో ఇలాంటి గొప్ప అవకాశం నాకు రాలేదని చెప్పాడట. దీంతో తన జీవితంలో ఎంతో ఇన్వాల్వ్ మెంట్ ఉన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ పొగిడేసరికి చెర్రీ ఆనందానికి అవధులు లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here