కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు వైసీపీలోకి

వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగు పెట్టడంతో కృష్ణాజిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు వైసీపీ పార్టీ లోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి కీలకంగా వ్యవహరించిన ఎల్లమంచిలి రవి వైసీపీ లోకి వచ్చారు.
అంతే కాకుండా ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో  అందరూ గమనిస్తున్నారు..2014లో ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. త‌నపై ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి, కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కై హోదాను కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు.
అదే విధంగా వైఎస్ జ‌గ‌న్ మాత్రం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఒకే స్టాండ్‌పై ఉంటూ.. కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నారంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం చేస్తున్న పోరాటాన్ని చూసిన ప‌లు పార్టీల నేత‌లు 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ముఖ్య అనుచ‌రుడుగా.. అలాగే, ఆర్థికంగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న దాస‌రి జై ర‌మేష్ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.
ఇందుకు సంబంధించి కృష్ణా జిల్లా వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు కూడా జ‌రిపార‌ట‌. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఏడు జిల్లాల యాత్ర ముగించుకుని ఎనిమిదవ జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ కి చుక్కలు చూపించాడు జగన్…మరి పాదయాత్ర మొత్తం పూర్తవుతూ రాష్ట్రంలో రాజకీయ పట్టం ఎలా ఉంటుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here