రాంగోపాల్ వర్మ పై దాడి చేయడానికి స్కెచ్ గీస్తున్న మెగాభిమానులు

తెలుగు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం అనేక మంటలు రగిల్చింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వడంలేదని…అలాగే అవకాశాలు ఇప్పిస్తామని అమ్మాయిల జీవితాలతో ప్రముఖ వ్యక్తులు ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద నటీనటులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని ఇటీవల ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ శ్రీరెడ్డి మీడియా ఛానల్ లో సోషల్ మీడియాలో తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే తాజాగా ఇటీవల పవన్ కళ్యాణ్ పై నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది శ్రీరెడ్డి.
అయితే దీనంతటికీ కారణం రాంగోపాల్ వర్మ అని తెలుస్తుంది.  శ్రీ రెడ్డి వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్న విషయాన్నీ శ్రీ రెడ్డి బయట పెట్టడంతో మెగా అభిమానుల ఆగ్రహం ఇంకా పెరిగింది. పవన్ కళ్యాణ్ పై ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు. అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాజగా మెగా అభిమానులంతా ఈ రోజు మీట్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంలో రాంగోపాల్ వర్మ పై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here