విలన్ గా జగపతిబాబు బుల్లితెరపై

తెలుగు సినిమారంగం సీనియర్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల తాజాగా విడుదలైన రంగస్థలం సినిమా లో ప్రెసిడెంట్ గారి పాత్రలో అద్భుతంగా నటించి సినిమా విజయం సాధించడంలో పెద్ద పాత్ర పోషించారు. దీంతో క్రేజీ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు జగపతిబాబు.
అంతే కాకుండా ఇటీవల బాలీవుడ్ లోకూడా విలన్ గా అవకాశాన్ని అందుకున్న అయన ఈ సారి బుల్లితెరపై కూడా విలన్ పాత్రలో కనిపిస్తాడట. తాజాగా అమెజాన్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసారు. ఈ సిరీస్ లో అయన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సిరీస్ త్వరలోనే షూటింగ్ మొదలు పెడతారట. మొత్తంమీద జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ అనేక అవకాశాలు దక్కించుకుంటున్నారు ఇంత వయసులో కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here