భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చాలా ఎక్కువే

మరి కొద్ది గంటలలో విడుదలవుతుంది ‘భరత్ అనే నేను’ సినిమా. అయితే ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల శివ హీరో మహేష్ బాబు ఈ సినిమా గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని మనకందరికీ తెలుసు. దీంతో మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ఎంతసేపు నటిస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.
కథ మొదలైన మొదటి పావుగంటలోనే మహేశ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడనీ, ఆ తరువాత సినిమా మొత్తం ఆయన ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని చెప్పారు. ఇక పూర్తిస్థాయి ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కొరటాల .. మహేశ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీస్ తెగ అనేక సంచలనాలు సృష్టించింది. మరోపక్క మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్నకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here