ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంటలు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ట్వీట్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన అనుకూల మీడియా పై ట్విట్టర్ సాక్షిగా మండిపడ్డారు. హీరోయిన్ శ్రీ రెడ్డి ని అడ్డుపెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని తన తల్లిని బాధ పరిచయ వేదంగా వ్యవహరించారని అన్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అతని మిత్రుడు కిలారు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిందని విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్న దేమిటంటే తాజాగా చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియాగా ముద్రపడిన పచ్చమీడియా అని ఆరోపించే టీవీ9,ఏబీఎన్ ఛానల్స్ అధిపతులు అయిన రవిప్రకాష్ ,వేమూరి రాధాకృష్ణ శ్రీనిరాజు ,ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటోలను పోస్టు చేస్తూ మీ మీ ఛానల్స్ రేటింగ్ కోసం డెబ్బై ఏళ్ళ తన తల్లిని బజారుకీడుస్తారా ..మీ ఇంట్లో ఆడవారు లేరా ..మీకు అమ్మ లేదా అంటూ తీవ్ర ఆవేదనతో ఆయన పోస్టు చేశారు.
ఏపీలో ప్రజలకు ఏమి సమస్యలు లేవన్నట్లు ఏకంగా తనపై ,తమ కుటుంబం మీద ఎవరో ఆరోపణలు చేస్తే మార్నింగ్ నుండి రాత్రి పడుకునేవరకు స్పెషల్ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ మా కుటుంబం మీద దాడి చేశారు.ఇది అంతా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గత ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు అంటూ బాధపడ్డారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఎలా గెలుస్తారో నేను చూస్తాను అన్ని హెచ్చరికలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here