పవన్ కళ్యాణ్ ని చంపడానికి స్కెచ్ గిసిన చంద్రబాబు

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే గత కొన్ని రోజులుగా అనేక రాజకీయ పరిణామాల రీత్యా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని విభేదించడం జరిగింది. ఇందులో భాగంగానే మొన్న గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ చేసిన అవినీతిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాని దెబ్బకొట్టడానికి శ్రీ రెడ్డిని రంగంలోకి దింపారని జనసేన పార్టీ వర్గీయుల మాట. దీనికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఉదయం ట్విటర్లో ప్రతిస్పందించారు.
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు క‌లిసి న‌న్ను చంపేందుకు స‌చివాల‌యం వేదిక‌గా కొంద‌రు రౌడీల‌తో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ స‌మ‌యంలో నేను ఏ క్ష‌ణానైనా చ‌నిపోవ‌చ్చు అంటూ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, ఏపీ స‌ర్కార్‌కు వంత‌పాడే ప‌చ్చ‌మీడియాను సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద‌ల్లేదు. నాపై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తూ.. ప‌దే ప‌దే ప్ర‌సారం చేస్తారా అంటూ ప‌వ‌న్ క‌ల్యాన్ ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌పై జ‌రుగుతున్న మీడియా దాడి అంతా చంద్ర‌బాబు, లోకేష్‌లు ద‌గ్గ‌రుండి న‌డిపిస్తున్నార‌ని బ‌హిరంగ ట్విట్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here