ఫిలించాంబర్ లో మంతనాలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్య నాగబాబు ఫిలింఛాంబర్ లో న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డిని అడ్డంపెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇటీవల శ్రీరెడ్డి విషయంలో తనను తన తల్లిని తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  
కొన్ని మీడియా ఛానెళ్ల వ్యవహారశైలిపై నల్ల దుస్తులు ధరించి పవన్‌ నిరసన తెలిపారు. ఇక పవన్‌ వెంటనే సోదరుడు నాగబాబు, మా ప్రెసిడెంట్‌ శివాజీరాజా కూడా ఉన్నారు. అనూహ్యంగా అల్లు అర్జున్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరూ ఫిలింఛాంబర్ దగ్గరికి భారీగా వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here