చింతమనేని కి షాక్ ఇచ్చిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో నిత్యం వివాదాలలో ఉండే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల హనుమాన్ జంక్షన్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై చేయి చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రాంతంలో పెద్ద రగడ సృష్టించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఓ సామాన్యుడు చింతమనేని ప్రభాకర్ అని ప్రశ్నించడంతో…చింతమనేని ప్రభాకర్ ఆ సామాన్య వ్యక్తి పై దుర్భాషలాడుతూ చేయి చేసేసుకున్నారు. అసలు వివాదానికి కారణం ఏమిటంటే నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటం…అదే సమయంలో అటుగా వెళుతున్న చింతమనేని దీనిని గమనించడం…వెంటనే తన అనుచరులతో డ్రైవర్‌‌ను, కండక్టర్‌ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు .
ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని తమపై దాడి చేశారని అర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు .అయితే ఈ విషయం కాస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో..ఎమ్మెల్యే చింతమనేని పై ముఖ్యమంత్రి మండిపడ్డారు.ఆర్టీసీ సిబ్బందితో పాటూ స్థానికులపై మండిపడటం, దాడి చేయడాన్ని తప్పుబట్టారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మదినం నాడు చంద్రబాబు చింతమనేని ప్రభాకర్ కు క్లాస్ పీకుతూ న్నట్లు తెలుస్తోంది. అయితే చింతమనేని ప్రభాకర్ చేసిన దాడికి అక్కడ ఉన్న స్థానికులు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్లిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here