తెలుగుదేశం పార్టీ నాయ‌కుల మృతికి కార‌ణాలివే..

తెలుగుదేశం పార్టీలో వరుస‌గా నేత‌లు మ‌ర‌ణించ‌డం విషాదానికి గురి చేస్తోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు నాయ‌కులు మృత్యువాత ప‌డ‌టం బాధాక‌రం.

టిడిపి సీనియ‌ర్ నేత చ‌ల‌మ‌ల‌శెట్టి రామాంజ‌నేయ‌లు మృతి చెందారు. క‌రోనాతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప‌దిరోజులుగా విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ శుక్ర‌వారం చ‌నిపోయారు. ఈయ‌న ఏపీ తొలి కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా పనిచేశారు. ఈయ‌న చ‌నిపోవ‌డంతో పార్టీ నేత‌లు దిగ్బ్రాంతికి లోన‌య్యారు. కాగా రామాంజనేయులు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తీవ్ర సంతాపం తెలిపారు.

నేడు మ‌రో నేత మారుతీ వ‌ర‌ప్ర‌సాద్ చ‌నిపోయారు. ఈయ‌న సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల‌లో టిడిపికి కీల‌క నాయ‌కుడు. వ‌ర‌ప్ర‌సాద్ అనారోగ్యం కార‌ణంగా క‌న్నుమూశారు. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబుతో పాటు లోకేష్ దిగ్బ్రాంతి వ్య‌క్తం చ‌శారు.  ఈయ‌న అట‌వీ శాఖ‌లో మాజీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక టిడిపిలో చేరి ప్ర‌జా సేవ చేస్తున్నారు. ఈయ‌న మృతిపై లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. వరప్రసాద్ మరణం టీడీపీకి తీరని లోటు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here