మంత్రికి క‌టింగ్ చేసి 60వేల రూపాయ‌లు నొక్కేశాడు..

టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చంటే ఇదేనేమో. ఓ మంత్రికి క్ష‌వ‌రం చేసి రూ. 60 వేల రూపాయ‌లు తీసుకున్న ఘ‌టన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. దీంతో అక్క‌డి వారంతా ఆ వ్యక్తిని శ‌భాష్ హీరో అంటూ అభినందిస్తున్నారు.

వివ‌రాల్లోకెళితే మ‌ధ్య‌ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా గుల‌య్‌మ‌ల్ గ్రామంలో ఓ రాజ‌కీయ స‌భ జ‌రిగింది. ఈ మీటింగులో రాష్ట్ర అట‌వీశాఖ మంత్రి విజ‌య్ షా పాల్గొన్నారు. స‌భ స‌జావుగా ముగిసిన త‌ర్వాత వేదిక‌పై వెంట‌నే రోహిదాస్ అనే ఓ యువ‌కుడు దూసుకెళ్లి త‌న‌కు రూ. 60 వేలు ఇస్తే హెయిర్ క‌టింగ్ సెలూన్ పెట్టుకుంటాన‌ని కోరారు. దీంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చి ఇలా అడుగుతున్నారేంట‌ని వాదించారు.

దీంతో వెంట‌నే స్పందించిన స‌ద‌రు మంత్రి స‌రే నీకు డ‌బ్బులు ఇస్తాను కానీ నీ టాలెంట్ ఏంటో త‌న‌కు తెలియాల‌న్నారు. త‌న‌కు క‌టింగ్ చేసి చూపించాల‌ని మంత్రి అత‌న్ని కోరారు. దీంతో వెంట‌నే రోహిదాస్ మంత్రికి క‌టింగ్ చేశారు. యువ‌కుడి టాలెంట్‌కు ఫిదా అయిన మంత్రి వెంట‌నే త‌న ఆధీనంలో ఉండే నిధుల నుంచి రూ. 60 వేలు ఇచ్చారు. దీంతో అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక్క క్ష‌వ‌రానికి రూ. 60 వేలు కొట్టేశార‌ని న‌వ్వుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here