మళ్ళీ తెగబడిన పాకిస్థాన్.. బార్డర్ లో కాల్పులు

భార‌త్‌కు ఎటు చూసినా ఇబ్బందులే క‌నిపిస్తున్నాయి. ఓ వైపు నాలుగు నెల‌లుగా చైనా దురాక్ర‌మ‌ణ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్చ‌లు జ‌రిపినా చైనా త‌న వ‌క్ర‌బుద్దిని చాట‌డం ఆప‌డం లేదు. ఓ వైపు యుద్ధం జ‌రుగుతుందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉండే పాకిస్థాన్ కూడా భార‌త సైన్యంపై దాడుల‌కు పాల్ప‌డుతోంది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దులో పాకిస్థాన్ సైన్యం భారీ దాడుల‌కు పాల్ప‌డుతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు. గ‌త మూడు రోజులుగా ఈ దాడులు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్ స‌రిహ‌ద్దులోని పూంచ్ జిల్లా మ‌నోకోట్ సెక్టార్లో బార్డ‌ర్లో ఈ దాడుల‌ను పాక్ ప్రారంభించింది. వ‌రుస‌గా మూడో రోజు పాక్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించింద‌ని అధికారులు చెబుతున్నారు.

అయితే పాక్ సైన్యం కాల్పుల‌ను భార‌త బ‌ల‌గాలు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నాయి. స‌రిహ‌ద్దులో జ‌వాన్లు పాక్ దుశ్చ‌ర్య‌ను తిప్పికొడుతున్నారు. ఇక జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో మందు పాత‌ర పేలిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో ఓ సైనికాధికారితో పాటు ఇద్ద‌రు తీవ్ర గాయాల పాల‌య్యారు. ఇక జ‌మ్మూక‌శ్మీర్‌లోని బ‌ద్గాం జిల్లాలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్లో గాయ‌ప‌డిన జైషే మ‌హమ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాది మృదేహాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here