తెలుగు ప్ర‌జ‌ల స్వామి అనారోగ్యంతో మృతి..

త‌న జీవితం మొత్తం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం కృషి చేసిన స్వామీజీ స్వామి అగ్నివేష్ చ‌నిపోయారు. తెలుగు ప్ర‌జ‌లు గొప్ప‌గా చెప్పుకునే ఈయ‌న అనారోగ్యం కార‌ణంగా ఢిల్లీలోని ఓ హాస్పిట‌ల్‌లో మృత్యువాత ప‌డ్డారు.

శ్రీ‌కాకుళం జిల్లాలో పుట్టిన ఈయ‌న పేరు వేపా శ్యామ్ రావు. చిన్న‌త‌నంలోనే త‌న తండ్రి చ‌నిపోవ‌డంతో చ‌త్తీస్ ఘ‌డ్‌లోని తాత‌య్య ఇంట్లో పెరిగారు. విద్యాబ్యాసం త‌ర్వాత‌ క‌ల‌క‌త్తాలో లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత హ‌ర్యానావెళ్లి అక్క‌డ ఆర్య స‌మాజ్‌లో చేరారు. అప్పుడే కుటుంబం ఆస్తులు వ‌దులుకొని స్వామి అగ్నివేష్‌గా మారారు. 1970లో ఆర్య‌స‌మాజ్ సిద్దాంతా ఆధారంగా ఆర్య స‌భ పార్టీని స్థాపించారు. 1977 ఎన్నిక‌ల్లో హర్యానా నుంచి విజ‌యం సాధించి విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు. బానిస విధానంపై ఈయ‌న పోరాడారు. ఢిల్లీ స‌మీపంలో ప‌లు చోట్ల ప‌నిచేసే బాల‌కార్మికుల విముక్తి కోసం ఎంతో కృషి చేశారు. ఈ పోరాటాల్లో అరెస్టు అయ్యి 14 నెల‌ల పాటు జైలు జీవితాన్ని ఆయ‌న అనుభ‌వించారు.

ఎన్నో సామాజిక స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందించి పోరాటాలు చేశారు. మావోయిస్టులు, ప్ర‌భుత్వాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిపారు. అట్ట‌డుగు వ‌ర్గాల కోసం ఆయ‌న పోరాడుతూనే వ‌చ్చారు. ఎంతోమంది నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నాడు. వ‌య‌సు మీద‌ప‌డినా ఆయ‌న అవిశ్రాంతంగా తిరిగేవారు. చివ‌ర‌కు ఆరోగ్యం క్షీణించ‌డంతో ఢిల్లీలోని హాస్పిట‌ల్‌లో చేరి చ‌నిపోయారు. ఈయ‌న మృతిప‌ట్ల ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, రాజ‌స్థాన్ సీఎం, కేర‌ళ సీఎంలు సంతాపం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here