బీజేపీతో టిడిపి దోస్తీ.. ? ప్ర‌చారం మొద‌లెట్టేశారుగా…

బీజేపీ, టిడిపి బంధం ఈ నాటిది కాదు. వాజ్‌పేయి ఉన్న‌ప్ప‌టి నుంచి మొన్న మోదీతో క‌లిసి న‌డ‌వ‌డం వ‌ర‌కు వీరి దోస్తీ బాగానే ఉంది. అయితే మ‌ధ్య‌లో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలంటూ చంద్ర‌బాబు బీజేపీ ప్ర‌భుత్వాన్ని కాద‌ని బ‌య‌ట‌కు రావ‌డం మ‌న‌కు తెలిసిన విష‌యాలే.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు దోస్తీ క‌ట్టబోతున్నార‌న్న పొలిటిక‌ల్ టాక్ ఏపీలో ఉంది. అయితే అది ఇటీవ‌ల చంద్ర‌బాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడ‌టం వ‌ల్ల‌నే జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల క‌రోనాతో ఇబ్బందులు ప‌డిన అమిత్‌షాతో చంద్ర‌బాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంద‌ని కుశ‌ల ప్ర‌శ్న‌లు అడిగారు.

అయితే ఆ త‌ర్వాత నుంచి టిడిపి అనుకూల వ‌ర్గం మొత్తం ఈ విష‌యాన్ని హైలెట్ చేస్తున్నాయి. అమిత్‌షాతో కీల‌క విష‌యాలు చ‌ర్చించార‌ని ఇప్పుడు ప్ర‌చారం మొదలు పెట్టారు. బాబు, అమిత్‌షా మ‌ధ్య సాన్నిహిత్య పెరిగింద‌ని త్వ‌ర‌లోనే బీజేపీతో టిడిపి జ‌త క‌డుతుంద‌ని అంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. అందుకు బ‌ల‌మైన పార్టీ అవ‌స‌రం. ఈ ప‌రిస్థితుల్లో అధికార వైసీపీని కాద‌ని, ఇప్ప‌టికే క‌లిసి ప‌నిచేస్తున్న జ‌న‌సేన‌ను కాద‌ని బీజేపీ పెద్ద‌లు టిడిపి వైపు అడుగులు వేస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీపై టిడిపి ఎలాంటి బంధం న‌డిపిందో అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేం. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని ఊహించిందే. బీజేపీ టిడిపితో ఎలా ముందుకెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here