హార్ట్ టచింగ్ వీడియోను షేర్ చేసిన సామ్.. !

సినిమాలతో పాటు వ్యాపారాలతో బిజీగా గడిపే నటి అక్కినేని సమంత సోషల్ మీడియాలోనూ నిత్యం బిజీగా ఉంటుంది. ఆన్ లైన్ లో వైరల్ గా మారే వీడియోలను అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. అలాంటి ఓ వీడియోనే ఇటీవల ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది సామ్.

తనతో ఎప్పటి నుంచో కలిసున్న ఆవును కొందరు వ్యక్తులు వ్యాన్ లో తీసుకెళ్తుండడాన్ని…  ఓ ఎద్దు తట్టుకోలేక పోయింది. వ్యాన్ వెనక పరిగెడుతూ

వెంబడించింది. ఆ ఘటనను స్థానిక వ్యక్తి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ అయింది. ఇదే వీడియోను సమంత షేర్ చేసి లవ్ సింబల్ జోడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here