హాట్ పాలిటిక్స్‌లో రాహుల్ గాంధీ కామెడీ సెటైర్లు..

దేశం హాట్ హాట్‌గా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం జోకులు వేస్తున్నారు. ఇటీవ‌ల దేశ రాజ‌కీయాల‌పై త‌న దైన శైలిలో స్పందిస్తున్నారు రాహుల్ గాంధీ. క‌రోనా ప‌రిస్థితుల ద‌గ్గ‌ర నుంచి, చైనా ఆక్ర‌మ‌ణ‌లు, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.

మొన్న‌జ‌రిగిన జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ క‌రోనా ప్ర‌భావం జీఎస్టీ వ‌సూళ్ల‌పై ప‌డింద‌ని చెప్పారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఆమె మాట్లాడారు. ప్ర‌స్తుతం ఇండియా, చైనా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల గురించి తెలిసిందే. చైనా త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూ భార‌త సైన్యాన్ని రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ల‌ద్దాక్‌లో చైనా దురాక్ర‌మ‌ణ‌ను కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ గానే కేంద్రం భావిస్తోందా అని వ్యంగాస్త్రాలు సంధించారు.

రాహుల్ ఇటీవ‌ల త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డుల‌ను మార్చుకున్నట్లు ప‌లువురు రాజ‌కీయ మేధావులు చెప్పుకుంటున్నారు. ఏదో ఒక‌టి అధికార పార్టీపై మాట్లాడ‌టం కంటే.. విష‌యాన్ని సూటిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారంటున్నారు. కాగా ఇటీవ‌ల నిర్మ‌లా సీతారామ‌న్ యాక్ట్ ఆఫ్ గాడ్ వ్యాఖ్య‌ల‌పై ఆమె భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కూడా స్పందించారు. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉంటే ప్ర‌భుత్వం ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని ఆయ‌న అన్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి యాక్ట్ ఆఫ్ గాడ్ కామెంట్స్ ఇప్పుడు పొలిటిక‌ల్ సెటైర్లుగా ప‌నికొస్తున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here